ఆఫీసులో రోజంతా ఏసీలో ఉంటున్నారా? వీటిని పాటిస్తే?

చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా పొడిబారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో తెలుస

Kowsalya| Last Updated: శుక్రవారం, 13 జులై 2018 (21:12 IST)
చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా పొడిబారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో తెలుసుకుందాం.
 
ఏసీ వలన వచ్చే చల్లటి గాలిలో తేమ ఎక్కువగా ఉండదు. కాబట్టి చర్మానికి కావలసిన తేమ అందాలంటే వీలైనంత వరకు నీళ్లను ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. దాంతోపాటే రెండు గంటలకొకసారైనా ఓ 5 నిమిషాల పాటు కారిడార్‌లో అటూ ఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి. క్లెన్సర్లూ, ఫేస్‌వాష్‌లు వాడుతున్నట్లైతే వాటిలో నురుగు రాకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.
 
అలాగే రెండుగంటలకోసారి చల్లని నీటితో ముఖాన్ని తుడుచుకోవాలి. చర్మం ఎక్కువగా పొడిబారుతుంటే స్వయంగా తేమను అందించే ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపాటి హ్యుమిడిఫయర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ధర తక్కువగానే ఉంటుంది. అలాకాకుంటే ఆఫీసు డెస్కు మీద గాజు పాత్ర ఉంచి అందులో నీళ్లు పోసి కొన్ని పూల రెక్కల్ని వేయాలి. ఈ అమరిక చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. తేమని అందించడంలో తోడ్పడుతుంది.దీనిపై మరింత చదవండి :