ప్రతిరోజూ అవకాడో తీసుకుంటే? కంటికి?

బుధవారం, 11 జులై 2018 (10:09 IST)

సీనియర్ సిటిజన్స్‌కు అవకాడో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండును రోజూ తీసుకుంటే వృద్ధుల కంటి ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరునెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజూ అవకాడోను తీసుకుంటే వృద్ధుల కళ్లల్లో ల్యుటిన్ ప్రమాణాలు పెరుగుతాయి.
 
దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ల్యుటిన్ పండ్లలో, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన పెరిగిన ల్యుటిన్ మెదడు, రక్తం, కళ్లల్లోకి  చేరుతుంది. ఇది యాంటి ఇన్‌ఫ్లమేటరీ ఏజెంటు మాత్రమే కాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌గా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతా శక్తి పెరగడాన్ని కూడా గుర్తించారు.
 
అవకాడో తీసుకోని వారిలో కాగ్నిటివ్ సామర్థ్యం పరిమితంగానే పెరగుడాన్ని కూడా పరిశోధకులు గమనించారు. మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా అవకాడో చాలా ఉపయోగపడుతుంది. సప్లిమెంట్స్ కన్నా తాజా అవకాడోలు తీసుకున్న వాళ్ల కళ్లల్లో ల్యుటిన్ ప్రమాణాలు రెట్టింపుగా ఉంటాయి. వృద్ధుల కంటిని, మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు అవకాడో దివ్యౌషదంగా సహాయపడుతుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

జామ ఆకులతో టీ త్రాగితే? శ్వాసకోశ సమస్యలు?

జామపండే కాదు జామ చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్య విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన ...

news

దంతాలను తాజాగా వుంచే పండ్లు, పదార్థాలు

దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ప్రెష్‌నర్లనే ...

news

ప్రకాష్‌రాజ్‌తో గొడవలా? అదో పెద్ద జోక్.. అనుపమ పరమేశ్వరన్

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య విబేధాలున్నట్లు ...

news

అల్సర్ అణిచేందుకు వంటింటి చిట్కాలు...

ప్రతి ఒక్కరూ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల ఆహార పదార్థాలను ...