శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 మే 2015 (13:36 IST)

మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ కాదు.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తోనే ముప్పు!!

మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ కంటే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధిక మహిళల ప్రాణాలు తీసుకుంటుందని తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అగ్ర స్థానంలో నిలిచింది. అయితే గత కొంతకాలంగా గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్‌ కంటే అత్యధిక మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. గుండెపోటు తరువాత మహిళల్లో అత్యధిక మరణాలకు కారణంగా రొమ్ము క్యాన్సర్ నిలుస్తోంది. 
 
'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ క్యాన్సర్ 2013' నివేదిక ప్రకారం 1990లో మొత్తం మరణాల్లో 12 శాతంగా ఉన్న క్యాన్సర్ మరణాలు 2013లో 15 శాతానికి పెరిగాయని పరిశోధకులు తెలిపారు. ఇక ఇండియా విషయానికి వస్తే క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 60 శాతం పెరిగింది.  
 
2013లో రొమ్ము క్యాన్సర్ కారణంగా 47,587 మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడి 40,985 మంది మృతి చెందారని ఈ నివేదిక వెల్లడించింది. గడచిన 23 సంవత్సరాల వ్యవధిలో ఇకపోతే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య 88 శాతం పెరుగగా, జీర్ణకోశ క్యాన్సర్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 64 శాతం పెరిగింది. ప్రొస్టేట్ క్యాన్సర్ మృతులు 220 శాతం పెరిగాయి.