శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:31 IST)

ఇంట్లోనే స్కిన్ వైటనింగ్ క్రీమ్ ఎలా చేయాలి?

ఇంట్లోనే స్కిన్ వైటనింగ్ క్రీమ్ ఎలా చేయాలంటే.. పెరుగు, తేనె చర్మానికి మేలు చేస్తాయి. ఈ రెండింటిని మిశ్రమంలా చిక్కగా క్రీమ్‌లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఈ క్రీమ్ ముఖం మీద కనీసం అరగంట పాటు ఉండనిచ్చి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
అలాగే ఎండిన ఆరెంజ్ తొక్కను మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో తాజాగా చల్లగా ఉండే పెరుగు తీసుకుని, అందులో ఆరెంజ్ తొక్క పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే స్కిన్ తెలుపుగా మారుతుంది. సన్ టాన్ నుంచి రిలీఫ్ కలుగుతుంది.