శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (17:39 IST)

మహిళా దినోత్సవం : భారత స్త్రీలకు బాధ్యతలే ముఖ్యం.. ఆరోగ్యం..?

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న అంశాలపై వివిధ సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ఇప్పటికే షాదీ డాట్ కామ్ జరిపిన సర్వేలో పెళ్లికి తర్వాత 40 శాతం మంది మహిళలు ఇంటి పేరును మార్చుకునేందుకు ఆసక్తి చూపట్లేదని తేలింది. తాజాగా ఐసీఐసీఐ లాంబార్డ్ నిర్వహించిన సర్వేలో భారత స్త్రీలు విభిన్న బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కానీ.. ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరని తేలింది. 
 
భారత మహిళలపై ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్స్యూరెన్స్ సంస్థ ఆన్ లైన్ సర్వే నిర్వహించగా, అందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. భారత మహిళల్లో 39 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా సౌకర్యం ఉందని ఆ సంస్థ తెలిపింది. వారిలోనూ తమ కోసం బీమా చేయించుకున్నవారు కేవలం 22 శాతమేనని వెల్లడైంది. 
 
అలాగే యాజమాన్యాలు కల్పించిన ఆరోగ్య బీమా సౌకర్యం కలిగిన వారు 16 శాతం మంది ఉన్నారట. బీమా ఉన్నప్పటికీ దాని వల్ల కలిగే లాభనష్టాలు, షరతుల గురించి తెలియని వారు 40 శాతం మంది ఉన్నారని ఐసీఐసీఐ లాంబార్డ్ తెలిపింది. బీమా ఆలోచనే లేని మహిళలు 53 శాతం మంది అని సర్వే చెప్పుకొచ్చింది.