శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (18:17 IST)

ప్రెగ్నెంట్‌గా ఉన్నారా? బద్ధకంగా ఉందా? ఇలా చేయండి

రాత్రి బాగా నిద్రపోయి తెల్లవారితే చాలా మంది బద్ధకంగా ఉంటారు. ఏ పని చేయబుద్ధికాదు. కూర్చున్నచోట నుంచి లేవాలనిపించదు. నిద్రరాదు. కాని కూర్చునో, పడుకునో ఉందామనిపిస్తోంది. ఇది చాలామందిలో కనిపించే సమస్యే. 
 
గర్భిణీగా ఉన్న తొలి నెలల్లో ఉన్న మహిళల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వారు ఉదయం లేవగానే డల్‌గా అనిపిస్తుంది. ఆందోళనగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తుంది. రోజులో దాదాపు మధ్యాహ్నం వరకూ ఇలాగే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఏమి చేయాలి. దీని నివారణకు కూడా మార్గాలున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితులలో గుజ్జుగా చేసిన యాపిల్‌, కాస్త వెనిగర్, టీ స్పూన్ తేనె కలపాలి. దీనిని నిద్రపోయే ముందు తీసుకుంటే సరిపోతుంది. లేచినప్పటి నుంచి ప్రాణం హూషారుగా ఉంటుంది. అలాగే గర్భిణీలు వీట్‌జర్మ్‌ను పాలతో కలుపుకుని గంటకొకమారు తాగడం మంచిది. ఉదయం పూట ఉండే బద్ధకం పోతుందని గైనకాలజిస్టులు అంటున్నారు. ఇంకా అరగంట పాటు మెల్లగా నడిస్తే చురుగ్గా ఉంటారని వారు సూచిస్తున్నారు.