శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (18:48 IST)

ఫేస్‌ బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తే అబ్బాయిల ఆకర్షణ కోల్పోతారట!!

ఇదేంటి..? అనుకుంటున్నారా.. నిజమండి. తమను తాము అందంగా, సెక్సీగా చూపించుకోవాలనే తపన టీనేజ్ యువతుల్లో ఉంటుందని, అలాంటి ఫోటోలను ఫేస్ బుక్ వంటి సామాజిక సైట్లల్లో పెట్టడం ద్వారా లాభాల కంటే నష్టాలే అధికమని పరిశోధకులు అంటున్నారు. ఇంకా ఫోటోలను సామాజిక సైట్లలో ఎక్కువగా వాడితే అబ్బాయిల ఆకర్షణ కోల్పోతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే., కెమెరా, ఇంటర్నెట్ అరచేతిలో ఇమిడిపోతున్నాయి. దానికి తోడు సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల యుగం నడుస్తోంది. యువతకు అకౌంట్ల సంఖ్య పెంచుకోవడం ఓ క్రేజ్. వాట్సప్, ఫేస్ బుక్, హైక్, ఒకటేమిటి రోజుకో కొత్త సైట్... అందులో ఓ అకౌంట్... దానిలోని మిత్రులతో చిట్ చాట్ దిన చర్యగా మారిపోయింది. అందులో లేటెస్ట్ అప్ డేట్ తో ఓ ఫోటో పెట్టడం మిత్రులతో లైక్ కొట్టించుకోవడం, ఓ కాంప్లిమెంట్ పొందడం క్రేజీ వ్యవహారమైపోయింది. వివిధ అంశాలను షేర్ చేసుకోవడం మామూలైపోయింది. 
 
ఈ రకమైన తీరుపై అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ మానసిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులోని ఫలితాలు కాస్త ఆలోచింపజేస్తున్నాయి. అందమైన, సెక్సీ ఫొటోలు పోస్టు చేస్తున్న అమ్మాయిల్లో పోటీతత్వం లేదనే అభిప్రాయం సహచర యువతుల్లో కనిపిస్తోందని పరిశోధన తెలిపింది. 
 
శారీరకంగా లేదా సామాజికంగా అంత ఆకర్షణీయంగా లేనివారే తరచూ ఫొటోలు పెడుతుంటారని ఆ పరిశోధన స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఫొటోల పట్ల తక్కువ భావన ఉందన్నది సుస్పష్టమని సైకాలజీ విభాగాధిపతి ఎలిజబెత్ డానియెల్స్ తెలిపారు.