శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (15:25 IST)

పెళ్లంటే అమ్మాయిలు భయపడుతున్నారా?

పెళ్లంటే అమ్మాయిలు భయపడుతున్నారా? ఇందుకు కారణాలేంటో పరిశీలిద్దాం.. సింగిల్ గా ఉన్నంత కాలం తమకు నచ్చినట్టుగా స్వేచ్చగా ఉండవచ్చని దాదాపు చాలా మంది యువతుల ఆలోచన. పెళ్ళైన తరువాత స్వేచ్చగా ఉండలేమని వారు భావిస్తున్నారు. 
 
భర్త, అత్తమామలు తమ స్వేచ్చకు అడ్డుగా ఉంటారన్న భావనతో వారు పెళ్లిని వీలైనంత వరకు పోస్ట్ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గరి నుంచి, అన్నదమ్ముల దగ్గరనుంచి, అక్కచెల్లెల్ల దగ్గరనుంచి లభించే ప్రేమ ఆప్యాయతలు కొత్తగా వెళ్ళే ప్రదేశంలో లభిస్తాయో లేదోనన్న భయం వల్ల పెళ్లి మీద అయిష్టత ఏర్పడుతుంది. 
 
పెళ్లి తరువాత జీవితం ఎలా ఉండబోతోందనే విషయంపై యువతులలో కొన్ని విషయాలపై అభిప్రాయాలుంటాయి. పెళ్లి, పిల్లలు, పిల్లల చదువులు వంటి ఆలోచనలెన్నో ఉంటాయి. 
 
కాని ఈ ఆలోచనావిధానానికి ఇప్పటి యువతులలో 'నేను నా ఇష్టం' అనే ఆలోచన కూడా తోడయింది. కాబట్టి వీరికి పెళ్లి అనేది అవసరమా అనే సందేహం కూడా వస్తుంది. అంతేకాదు.. ఆధునిక పోకడల పుణ్యంతో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా పెళ్లిపై అనాసక్తత చూపిస్తున్నారు.