శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:57 IST)

ఇంటి విషయాలు ఇంటి వరకే.. ఆఫీస్ విషయాలు ఆఫీస్ వరకే?

మహిళ ఉద్యోగినులకు ఎదురయ్యే మెుదటి సమస్య వర్క్‌లైఫ్ బ్యాలెన్సింగ్. అంటే అటు ఇంటికి కావలసినవి చేయాలి.. ఇటు వర్క్ బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో మహిళలు సతమతమవుతుంటారు.

మహిళ ఉద్యోగినులకు ఎదురయ్యే మెుదటి సమస్య వర్క్‌లైఫ్ బ్యాలెన్సింగ్. అంటే అటు ఇంటికి కావలసినవి చేయాలి.. ఇటు వర్క్ బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో మహిళలు సతమతమవుతుంటారు. కొందరు మహిళలకు వీటి గురించి అసలు తెలియదు. దీంతో తీవ్రమైన అలసట, ఒత్తిడికి లోనవుతుంటారు. వీటి నుండి విముక్తి చెందుటకు ఈ పరిష్కాల మార్గాలు తెలుసుకుంటే చాలు..
 
మీకున్న కోరికలు, ఆలోచనలు, లక్ష్యాలు బాగానే ఉండొచ్చు. కానీ అవి జరగాలంటే వాటి గురించి ఇతరులకు చెప్పుకుంటే మంచిది. అలానే ఇంటిపరంగా మీకున్న ఇబ్బందులను వర్క్ ప్లేస్‌లో చెప్పుకుంటేనే మీరేమనుకుంటున్నారనే విషయం అటు ఇంట్లో, ఇటు ఆఫీసులో తెలుస్తుంది. అప్పుడే మీరు చేసే పని ఏమిటనే విషయం మీరు తెలుసుకుంటారు. 
 
ఇలా చేస్తే కూడా మీరు కాస్త రిలాక్స్‌గా ఉండొచ్చు. అందేమిటంటే.. మీరు ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ రోజు మీరు చేయాలనే పనులన్నింటినీ ఒక పుస్తకం రాసుకుని ఒక్కోదానిని పూర్తిచేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే మీరు చేయాలనుకున్న పనులన్నీ వేళకు త్వరగా పూర్తిచేయగలుగుతారు. ఆఫీసు విషయం ఇలా ఉంటే మరి ఇంటి కథేంటీ...
 
మీరు ఇంటికి వచ్చిన తరువాత ఆఫీసు గురించి ఆలోచించకూడదు. ఒక్కోసారి కొన్ని సమస్యల ప్రభావం మన పనీతీరుపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరు మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. అలానే ఒత్తిడిలో పడకుండా ఆ విషయాల నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. 
 
ముఖ్యంగా ఇంటి ఒత్తిడిని మాత్రం ఎప్పుడూ ఆఫీసు పనిపై పడకుండా చూసుకోవాలి. ఒకవేళ అలావుంటే తప్పకుండా మీరు ఆఫీసు పనిచేయాలేరు. కనుక వీలైనంత వరకు ఇంటి విషయాలు ఇంట్లో.. ఆఫీసు విషయాలు ఆఫీసులో చూసుకోవడమే మంచిది.