గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (12:30 IST)

జామపండుతో ఫేస్‌ప్యాక్..?

జామపండుతోని మినరల్స్ పొడిబారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. ఇప్పుటి కాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండువు. మరి జామపండుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే.. కలిగే లాభాలు ఓసారి..
 
ముందుగా ముఖాన్ని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఓ జామపండు తీసుకుని దాని తొక్కను తీసి ఆపై మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తరువాత కాటన్ బాల్స్‌తో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఇలా తరచు చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
 
అదే జామపండు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత నీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి వేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. చర్మం కోమలంగా, మృదువుగా తయారవుతుంది.
 
బాగా పండిన జామపండును తీసుకుని రెండు భాగాలుగా చేయాలి. మధ్యలో ఉండే గింజలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలకు రెండు లేదా మూడు జామ ఆకులను కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓ స్పూన్ పేస్ట్‌ను చిన్న బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్‌లో రెండు స్పూన్ల పాలు వేసి బాగా కలపాలి. జిడ్డు చర్మం గలవారు ఈ మిశ్రమంలో అరస్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.