శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By chitra
Last Updated : గురువారం, 24 మార్చి 2016 (10:09 IST)

పట్టులాంటి కురుల కోసం... దువ్వెన ఎంపికలో తీసుకావాల్సిన జాగత్తలేంటి!

నల్లగా నిగనిగలాడే పొడవాటి కురుల కోసం ఏం చేయాలంటే.. జుట్టు తత్వాన్ని బట్టి దువ్వెన వాడాలని బ్యూటీషన్లు చెబుతున్నారు. తలను నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల రక్తసరఫరా మెరుగవుతుంది. దీనివల్ల కుదుళ్ళు గట్టిపడతాయి. అయితే ఇప్పుడున్న కాలంలో నెమ్మదిగా దువ్వుకునే తీరిక, ఓర్పు రెండూ మనుషులకు ఉండటం లేదు. అందుకే తలను దువ్వుకునే కొద్దిసేపైనా సరైన బ్రెష్‌ను ఎంచుకోవాలి.
 
రింగుల జుట్టుకి: 
జుట్టు ఉన్నదానికంటే తిన్నగా కనిపించాలని కోరుకునేవారు వెడల్పాటి బ్రెష్‌ను ఉపయోగించాలి. ఉంగరాల్ని పెంచుకోవాలంటే లీవ్-ఇన్-కండిషనర్ ఉపయోగించాలి. అలాగే హెయిర్ డ్రయర్ కూడా. అయితే దీనిని తరచుగా వాడకూడదు. ఎక్కువుగా ఉపయోగిస్తే జుట్టంతా పొడిబారిపోతుంది. 
 
పల్చని జుట్టుకి: 
జుట్టు బలహీనంగా లేదా తక్కువుగా ఉన్నట్లయితే పళ్ళు బాగా దగ్గర దగ్గరగా ఉండే బ్రెష్ ఉపయోగించాలి. స్ట్రెయిట్ జుట్టు ఉన్నట్లయితే అదృష్టవంతులే. ఎటువంటి బ్రెష్ అయినా వాడుకోవచ్చు. 
 
చిక్కుల జుట్టుకి: 
జుట్టు ఊరికే చిక్కులు పడేవారు వెడల్పాటి పళ్ళున్న బ్రెష్ వాడాలి. చిన్న చిన్న పళ్ళు మరింత దగ్గరగా వున్న బ్రెష్ వాడాలి. జుట్టు చిక్కులు త్వరగా విడిపోయేందుకు వీలుగా ఉండే ఉత్పత్తులు ఉపయోగించాలి. జుట్టు అదుపులో ఉండేందుకు కొద్దిపాటి నూనె అప్లయ్ చేస్తుండాలి. 
 
స్ట్రెయిట్ హెయిర్: 
జుట్టు లేయర్ల లాగా కట్ చేసినట్లయితే, దానిని ట్విస్ట్‌చేసి, తడిపొడిగా ఉన్నప్పుడే బన్‌తో రోల్ చేసుకోవాలి. డ్రైయర్ నుంచి కొంత వేడిగాలితో డ్రై చేస్తే లేయర్లు మరింత స్పష్టంగా అందంగా కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇతరులను ఆకర్షించే విధమైన జుట్టు మీ సొంతం అవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.