శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By pnr
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (12:16 IST)

జుట్టు త్వరగా తెల్లబడిపోతుందా? హెయిర్ టానిక్‌లా పని చేసే కరివేపాకు!

సాధారణంగా చాలా మంది యువతీయువకుల్లో బాల్యంలోనే జుట్టు నెరసిపోతుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుంది. ఈ సమస్య మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి కరివేపాకు ఓ టానిక్‌లా పని చేస్తుంది. ఇలాం

సాధారణంగా చాలా మంది యువతీయువకుల్లో బాల్యంలోనే జుట్టు నెరసిపోతుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుంది. ఈ సమస్య మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి కరివేపాకు ఓ టానిక్‌లా పని చేస్తుంది. ఇలాంటివారు.. కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజమూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉంటుంది. 
 
ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడిచేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడిచేయడం ఆపేసి దించేయాలి. ఇలావచ్చిన నూనెను వారంలో రెండు మూడు సార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. పైగా వెంట్రుకలు కూడా చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.