తైవాన్‌ను రక్షిస్తా: జో బైడెన్
తైవాన్‌పై చైనా దాడికి దిగితే తాము తైవాన్‌ను రక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తమ బలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంలోనే తాము అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశమని ఆయన పేర్కొన్నారు.
చైనా-తైవాన్ ఉద్రిక్తల నేపథ్యంలో తాజాగా ఓ ప్రకటనలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో చైనా కొన్నాళ్లుగా అతివాద ధోరణి ప్రదర్శిస్తోంది. తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తైవాన్ గగనతలంలోకి 52 యుద్ధవిమానాలను చైనా పంపింది. కొద్ది రోజులుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు దిగుతోంది.
కాగా, తైవాన్‌తో అమెరికాకు ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి మార్పు లేదని, ఆ పాలసీలనే ఇకపై కూడా కొనసాగిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. తైవాన్‌ను చైనా నుంచి కాపాడతామని చైనాకు పరోక్షంగా హెచ్చరిక చేశారు. అయితే తైవాన్-చైనాలను ఏకం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, చైనాకు తైవాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. చైనా ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. తాజాగా అమెరికా బహిరంగ మద్దతు రావడంతో తైవాన్‌కు మరింత ఆర్థిక స్తైర్యం వచ్చి ఉంటుందని, డ్రాగన్ కాస్త వెనకడుగు వేయొచ్చని అంటున్నారు.