బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2024 (12:43 IST)

మొబైల్ నెట్వర్క్ మార్చాలని చూస్తున్నారా?!

mobile massage
ఈమధ్య ప్రైవేట్ నెట్వర్క్ సంస్థలు తమ టారిఫ్ లను విపరీతంగా పెంచేసాయి. దీనితో వినియోగదారులు వున్న నెట్వర్క్ వదిలేసి మరో నెట్వర్కుకి జారుకుంటున్నారు. ఐతే నెట్వర్క్ మార్చేటపుడు నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఉన్న నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్కుల లోకి మారే ముందు మీ ప్రాంతంలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్‌లో గూగుల్ లోకి వెళ్లి nperf.com ను ఓపెన్ చేయండి. అందులో coverage mapలోకి వెళ్లండి.
 
Carrier optionలో మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆపరేటర్‌ను (బిఎస్ఎన్ఎల్ లేదా జియో లేదా ఎయిర్ టెల్) సెలెక్ట్ చేసి సెర్చ్‌లో మీ ఊరు పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి. దీంతో మీ ఊరు చుట్టూ ఉన్న బిఎస్ఎన్ఎల్ లేదా జియో లేదా ఎయిర్ టెల్ లేదా వొడాఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్ కనిపిస్తే 3G సిగ్నల్స్, ఆరెంజ్ కలర్ కనిపిస్తే 4G సిగ్నల్స్, పర్పుల్ కలర్ కనిపిస్తే 5G సిగ్నల్స్ ఉన్నాయని అర్థం. అసలు ఏ కలర్ కనిపించకపోతే అక్కడ ఆ నెట్వర్క్‌కి సిగ్నల్ లేదని అర్థం. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మీ నంబరు మార్చుకోవడం, లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడం మంచిది.