సెప్టెంబరు 9 నుంచి 15 వరకూ మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, సింహంలో రవి, బుధులు, తులలో శుక్ర గురులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు, సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 9న పోలాల అమవాస్య, 11న బలరామ జయంతి, 12న వరాహ జయంతి, 13న వినాయకచవితి.

raman| Last Modified శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:17 IST)
కర్కాటకంలో రాహువు, సింహంలో రవి, బుధులు, తులలో శుక్ర గురులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు, సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 9న పోలాల అమవాస్య, 11న బలరామ జయంతి, 12న వరాహ జయంతి, 13న వినాయకచవితి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలతో తీరక ఉండదు. కొత్త పరిచయాలేర్పడుతాయి. సమర్ధతను చాటుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. మంగళ, శని వారాల్లో అయినవారే మోసగించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒత్తిడి, చికాకులు అధికం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గురు, శుక్ర వారాల్లో సాయం ఆశించవద్దు. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఖర్చులు పర్వాలేదనిపిస్తాయి. దైవకార్యానికి బాగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తి ఉపాధఇ పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి.  
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. అవకాశాలను దక్కించుకుంటారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. ధనలాభం ఉంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. శనివారం నాడు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పెద్దల సలహా పాటించండి. పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వేడకకు సన్నాహాలు సాగిస్తారు. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు నిదానంగా ఫలిస్తాయి. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. అనుకూల పరిస్థితులున్నాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. దైవకార్యాలకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. విలువై వస్తువులు, నగదు జాగ్రత్త. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడకులు, దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలె చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పట్టుదలకు పోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధఇ. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణం తలపెడతారు.
 
కన్య: ఉత్తర 2, 3 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతారియ. నోటీసులు అందుకుంటారు. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోక బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. క్రీడాకారులకు ఆశాభంగం.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ కష్టం, అంచనాలు  ఫలించవు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఓ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. పట్టుదలంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పొదువు ధనం అందుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో శ్రమ అధికం, ఫలితం స్వల్పం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాభివృద్ధఇకి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్ట
గత తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. ఆశించిన అవకాశాలు దక్కకపోవచ్చు. గురు, శుక్ర వారాల్లో పనులు ముందుకు సాగవు. నగదు, వస్తువులు జాగ్రత్త. అవసరాలకు ధనం అందుతుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. ప్రియతములను కలుసుకుంటారు. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మెుహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. మీ శ్రీ మతి వైఖరిలో మార్పు సంభవం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. 
 
ధనస్సు: మూల, పుర్వాషాడ 1వ పాదం
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. బంధుమిత్రులు ఇరకాటానికి గురిచేస్తారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. శనివారం నాడు ఏకపక్షంహగా వ్యవహరించవద్దు. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతాం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆది, సోమ వారాల్లో ఒక వ్యవహారాలంలో మీ జోక్యం అవసరం. పనుల మెుండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి సారిస్తారు. ఒప్పందాలు, చెల్లింపులల్లో జాగ్రత్త. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారులు అంతంత మాత్రంగా సాగుతాయి. ఏజెన్సీలు, టెండర్లు దక్కకపోవచ్చు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పుర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఓర్పుతో మెలగాలి. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాలు విలువై వస్తువు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. గృహమార్పు కలిసివస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
మీనం: పుర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అంచనాలను మించుతాయి. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. పరిచయాలు బలపడుతాయి. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆది, సోమ వారాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు.దీనిపై మరింత చదవండి :