మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (08:57 IST)

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

crime
ఇటీవలి కాలంలో పురుషులపై మానసిక, భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దంపతుల మధ్య ఏర్పడే మనస్పర్థలు కారణంగా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. అనేక సంఘటనల్లో భర్తలపై భార్యలు దాడులు చేస్తున్నారు. పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తను కడతేర్చుతున్నారు. ఈ తరహా హత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని హైదర్‌గూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇదే విషయంపై ఎన్.ఎస్.ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నాడు. తమకు వివాహమైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ, మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.