యువ దర్శకుడితో మెహరీన్ ప్రేమాయణమా..?

Mehreen
జె| Last Modified మంగళవారం, 8 జనవరి 2019 (20:08 IST)
మెహరీన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు మెహరీన్. అగ్ర హీరోయిన్ స్థానంలో చేరిపోయారు మెహరీన్. తాజాగా మెహరీన్ ఎఫ్ 2 చిత్రం ద్వారా సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఐతే ఈమెపై సినీపరిశ్రమలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ యువ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉందట.

వరుస హిట్ సినిమాలతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సదరు దర్శకుడు ఇప్పటికే మెహరీన్‌తో కలిసి ఓ చిత్రం కూడా చేశాడట. మరి ఇది ఎప్పటిలానే గాలివార్తగా మిగిలిపోతుందేమో కానీ ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు మెహ్రీన్ నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల కానుంది.దీనిపై మరింత చదవండి :