కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం.. కారణం ఏంటంటే?
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చిన కొద్ది నిమిషాలకే కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లోని మూడు ఏసీ కోచ్‌లు మంటలు చెలరేగాయి. మొదట A1 కోచ్‌లో మంటలు చెలరేగాయి, ప్రయాణికులు అలారం లాగడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ మంటలు మొదట ఏ1 నుంచి బీ6, బీ7 కోచ్‌లకు వ్యాపించింది. అప్పటికే రైలు స్టేషన్‌లో నిలిచిపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పారు. అధికారులు సత్వర చర్యలు తీసుకోవడంతో మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా నిరోధించారు.
అనంతరం రైలులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించేందుకు రైల్వే అధికారులు అందరికీ సహకరించారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్య్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.