Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు పచ్చి మోసకారి.. ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు : సినీ నటి కవిత

బుధవారం, 23 ఆగస్టు 2017 (09:01 IST)

Widgets Magazine

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, సినీ నటి కవిత సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఓ మోసకారి అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి, తీరా వేరే వాళ్లకు ఇచ్చారని ఆమె ఆరోపించారు. 
 
టీడీపీలో ఆర్య వైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న ఆమె, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న ఆగ్రహంతో ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ... ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు వైశ్యులకు దక్కలేదని, తనకు ఎమ్మెల్యే సీటిస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
ఎన్టీఆర్ ఉన్నప్పటి టీడీపీ, ఇప్పడున్న పార్టీకి పోలిక లేదని కూడా వ్యాఖ్యానించారని సమాచారం. ఈ సంవత్సరం మహానాడులో తనను అవమానించారని, తనతో కన్నీరు పెట్టించారని కవిత వాపోయిన్నారు. ఇక ఆమె వైకాపాలో చేరుతారని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నంద్యాల బై పోల్ ఫైట్ : ఓట్లేసేందుకు బారులు తీరుతున్న ప్రజలు

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌ బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు ...

news

చిన్నారుల ప్రాణాలు తీసే 'బ్లూ వేల్‌ ఛాలెంజ్'... సుప్రీం ఏమంటోంది?

చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ...

news

'పిల్లికి ఎలుక సాక్ష్యం' అంటే ఇదే... ఉగ్రవాదంపై పాక్‌ను వెనకేసుకొచ్చిన చైనా..!

ఉగ్రవాదంపై పోరాడే దేశాల జాబితాలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై ...

news

అమ్మకు కాన్పు చేసిన పదేళ్ల కుమారుడు.... ఎక్కడ?

ఓ పదేళ్ళ బాలుడు కన్నతల్లికి సురక్షితంగా కాన్పు చేశాడు. అదీ కూడా ఏ ఒక్కరి సహాయం లేకుండా ...

Widgets Magazine