శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (11:57 IST)

మానవత్వమా నీవెక్కడ అంటూ ప్రశ్నస్తున్న స్పీకర్ కోడెల

ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. సమాజంలో రోజురోజుకు మానవత్వం కరువై పోతోందని మథనపడుతున్నారు. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష

ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. సమాజంలో రోజురోజుకు మానవత్వం కరువై పోతోందని మథనపడుతున్నారు. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష్ణారావు రచించిన ‘గాంధీ ధర్మ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ భరత్, స్వచ్ఛ భరత్, గాంధీజీ సింద్ధాంతాలని ఇప్పటికీ వీటిలో మనం వెనుకబడి ఉన్నామన్నారు. దేశం గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలన్నారు. అంహిసా మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గాంధీజీ ఒకేతాటిపైన నడపగలిగారని తెలిపారు. 
 
బ్రిటీష్‌వారు మహాత్మా గాంధీని చూసి బయపడ్డారంటే అదే అహింసకు ఉన్న గొప్పతనమని… ఆయన అప్పుడే చెప్పారు స్వేచ్ఛ భరత్ ఎంత ముఖ్యమో స్వచ్ఛ భరత్ అంతే ముఖ్యమని గుర్తుచేశారు.