మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 జనవరి 2018 (16:46 IST)

సంక్రాంతి: అశ్లీల నృత్యాలుగా అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందేలు, పేకాట, గుండాట, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తా

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందేలు, పేకాట, గుండాట, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి.

అయితే పలు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. నగరాల నుంచి సంక్రాతి కోసం పల్లెకు వెళ్లిన వారి కోసం.. ఓ వైపు సంప్రదాయ క్రీడలతో పాటు మరోవైపు రకార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు. 
 
అటు తిరిగితే కోడి పందేలు, ఇటు తిరిగితే రికార్డింగ్ డ్యాన్సుల జోరు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు మిన్నకుండిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా రికార్డింగ్ డ్యాన్సులు అర్థరాత్రి తరువాత అశ్లీల నృత్యాలుగా మారిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా, శంకరగుప్తం, కేశనపల్లి, సఖినేటిపల్లి, మగటపల్లి, మల్కిపురం, తూర్పుపాలెం, దామచర్ల గ్రామాల్లో అశ్లీల నృత్యాలు చోటుచేసుకుంటున్నాయి.