Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అచ్చెన్నాయుడిని బెదిరించిన ఆ ఇద్దరు అరెస్ట్- రూ.80లక్షలతో యాగం చేశారా?

సోమవారం, 15 జనవరి 2018 (15:59 IST)

Widgets Magazine
achennaidu

గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు జ్యోతిష్యునికి రూ.80లక్షలు సమర్పించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు మాసంలో జ్యోతిష్యుడు కాళిదాసు వర్మ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగాన్ని అచ్చెన్నాయుడు నిర్వహించారని సిక్కోలులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ యాగాన్ని అచ్చెన్నాయుడు సతీసమేతంగా నిర్వహించారని తెలుస్తోంది. గ్రహస్థితులు బాగాలేవని తెలుసుకున్న మంత్రి.. ఇందుకోసం జ్యోతిష్యుడికి ఏకంగా రూ.80 లక్షలకు పైనే ముట్టజెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
 
కానీ పెద్ద మొత్తంలో మంత్రి నుంచి డబ్బులు గుంజాలని పథక రచన చేసిన కాళిదాసు నక్సలైట్ల పేరుతో బెదిరించి, అడ్డంగా బుక్కయ్యాడు. అనుచరుడితో కలిసి మంత్రి ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చి పోలీసులకు చిక్కాడు.

ప్రస్తుతం శర్మతోపాటు అతడి అనుచరుడు కూడా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. శర్మ అతని అనుచరులు మంత్రి అచ్చెన్నాయుడుకు బెదిరింపు కాల్స్‌ చేశారు. అయితే వీరిని పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పూంచ్ సెక్టార్లో భారత్ మరో సర్జికల్ స్ట్రైక్స్ : పాకిస్థాన్ రేంజర్లు అరెస్ట్

సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఓ నిర్దేశిత ప్రాంతంలో పక్కాగా నిఘా నిర్వహించి దాడి చేయడం. ఈ ...

news

పవన్ కల్యాణ్‌ను నేను తిట్టలేదు... కేసీఆర్‌తో భేటీ ఎందుకయ్యాడు?: వీహెచ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ...

news

కిమ్‌తో సత్సంబంధాలా...? నో ఛాన్స్.. అది ఫేక్ న్యూస్: డొనాల్డ్ ట్రంప్

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య ...

news

జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత... అపస్మారక స్థితిలో కంచి స్వామి

కంచి కామకోటి పీఠాధిపతి, శంకరాచార్య జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ...

Widgets Magazine