తితిదే ఈఓకు చేతులు జోడించి దణ్ణం పెట్టిన సీఎం...!

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (14:29 IST)

ttd eo - cm

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
 
తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతిని తిరుమలలో బస చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్, టిటిడి ఈఓతో పాటు పలువురు మంత్రులు, అధికారులు వెళ్ళారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ ఒకే గదిలో ఉన్నారు. ఆ గదిలోకి టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ లోపలికి వస్తుండగా చంద్రబాబునాయుడు రెండు చేతులు జోడించి నమస్కరించారు. 
 
ఈఓ మాత్రం వికటాట్టహాసంతో చంద్రబాబు నాయుడును పలుకరించి ఆ తర్వాత అక్కడ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి  ఐఎఎస్‌కు నమస్కరిస్తే ఆయన కనీసం తిరిగి నమస్కరించకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అవినీతిలో పాకిస్థాన్ కంటే భారత్ ముందు.. ఆసియాలో టాప్

ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ...

news

అధిక బరువు వల్లే పీఎస్ఎల్వీ రాకెట్ విఫలం : డైరెక్టర్ శివకుమార్

ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-39 ప్రయోగం విఫలం ...

news

తెలుగు రాష్ట్రాలకు మోడీ టోపీ... హరిబాబుకు నిరాశ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు ...

news

పియూష్ గోయెల్‌కు పదోన్నతి.. రైల్వే శాఖ అప్పగింత..

కేంద్ర మంత్రివర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణలో భాగంగా, నలుగురు మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర ...