ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2017 (13:46 IST)

ప్రొఫెసర్ ఐలయ్య ఓ సైకో - ఆర్యవైశ్యులు.. చంద్రబాబు సీరియస్

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం మనోభావాలను కించపరిచేట్లు వ్యాఖ్యానించడం, రాయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ ఐలయ్య సైకోగా మారిపోయారని ధ్వజమెత్తారు ఆర్యవైశ

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం మనోభావాలను కించపరిచేట్లు వ్యాఖ్యానించడం, రాయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ ఐలయ్య సైకోగా మారిపోయారని ధ్వజమెత్తారు ఆర్యవైశ్యులు.

ఆర్యవైశ్యుల గురించి ఏం తెలుసునని అందరూ స్మగ్లర్లంటూ పుస్తకం రాశాడని ప్రశ్నించారు. ప్రొఫెసర్‌గా వున్న ఐలయ్య వెంటనే ఆర్యవైశ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఐలయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఐలయ్య వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులమతాలపై మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం సంతోషంగా ఉందన్నారు తిరుపతి ఆర్యవైశ్యులు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్యులు, ఐలయ్య రాసిన పుస్తకాన్ని తగులబెట్టారు.