Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను దళితుడినే... కానీ పార్టీ ఎమ్మెల్యేను కానా: బద్వేల్ టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:47 IST)

Widgets Magazine
jayaramulu

పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలోకి చేరిన వైకాపా ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేతలు ఆ దళిత ఎమ్మెల్యేను ఓ ఆట ఆడుకుంటున్నారు. దీంతో ఆయన తన బాధను మీడియా ముందు వెళ్లబోసుకున్నాడు. 
 
కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యేగా జయరాములు ఉన్నారు. ఈయన విలేకరులతో మాట్లాడుతూ 'నేను తెలుగుదేశం పార్టీలో లేనా? ఆ పార్టీ ఎమ్మెల్యేను కాదా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తాను టీడీపీలో చేరాను' అని అన్నారు. బద్వేలు నియోజకవర్గం పేరుకే ఎస్సీ రిజర్వుడు... పెత్తనమంతా ఒక వర్గం వారిదేనని, నియోజకవర్గంలోని ప్రజలను అభివృద్ధి చెందకుండా అడ్డుకునేది ఆ వర్గమని ఆయన ఆరోపించారు. 
 
దళిత ఎమ్మెల్యేనైన తన ఆత్మగౌరవం దెబ్బతినేలా మాజీ ఎమ్మెల్యే ప్రవర్తించడం బాధాకరమని ఆయన వాపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మంత్రులంతా కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ఎమ్మెల్యే నిలదీశారు. దళితులపై ఎందుకు ఇంత చిన్నచూపు అని, వారిని మనుషులుగా గుర్తించాలి కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గంలో 7 సబ్‌స్టేషన్లు మంజూరు చేయించామని, అయితే తనకు తెలియకుండా సబ్‌స్టేషన్‌లో నియామకాలు జరిగిపోవడం చూస్తే తాను టీడీపీ ఎమ్మెల్యేను కాదా అని ఆయన ప్రశ్నించారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న గౌరవంతో పార్టీలోకి వచ్చానని, ఇప్పుడు తనను కూడా టార్గెట్‌ చేస్తూ, నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలపై త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నట్లు ఆయన తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడు బద్వేల్ జయరాములు Badvel Mla Jayaramulu Local Tdp Leaders

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమిత్ షాకు రెచ్చగొట్టడం తప్ప ఇంకేమీ తెలియదు: సిద్ధరామయ్య

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...

news

రాజౌరీ సెక్టార్‌లో పాక్ సైనికుల బుల్లెట్ల వర్షం... నలుగురు సైనికుల మృతి

శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ ...

news

మీరు ఆవేశపడొద్దు.. బీజేపీపై వ్యతిరేకత లేదు : ఎంపీల భేటీలో చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార తెలుగుదేశం ...

news

70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన బస్సు డ్రైవర్.. అరెస్ట్

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 ...

Widgets Magazine