Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు మేజర్ సర్జరీ

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (19:07 IST)

Widgets Magazine
balakrishna

హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణకు శనివారం ఓ మేజర్ సర్జరీ జరిగింది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ చేశారు. ఆయన నటించిన చిత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన గాయపడ్డారు. అప్పటి నుంచి రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 
 
ఆ తర్వాత 'పైసా వసూల్', 'జై సింహా' వంటి చిత్రాలకు ణుందుగానే కమిట్ కావడంతో సర్జరీ చేయించుకోలేక పోయారు. పైగా, ఇంతకాలం తాత్కాలిక చికిత్సతో నెట్టుకొచ్చిన ఆయన... ఇపుడు శాశ్వత పరిష్కారం కోసం చికిత్స చేసుకున్నారు. 
 
ఈ స‌ర్జ‌రీ చేసుకోవ‌డానికి బాల‌కృష్ణ శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కి చేరుకున్నారు. వెంట‌నే క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)ల సారథ్యంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సర్జరీ దాదాపు గంట‌సేపు జ‌రిగినట్టు వైద్యులు వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నందమూరి బాలకృష్ణ సింహా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు Knee Surgery Jai Simha Hero Balakrishna

Loading comments ...

తెలుగు సినిమా

news

చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు : లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) ...

news

నానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన నిత్యామీనన్ (వీడియో)

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన ''అ'' సినిమాలో నిత్యమీనన్ నటిస్తోంది. ఈ చిత్రం ...

news

2019లోనే ''సాహో'' విడుదల.. పెళ్లి గురించి ప్రభాస్‌నే అడగాలి: శ్రద్ధా కపూర్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ...

news

యాంకర్ సుమ అత్త నటి కన్నుమూత

సినీ నటుడు రాజీవ్ కనకాల తల్లి, బుల్లితెర యాంకర్ సుమ అత్త అయిన నటి లక్ష్మీదేవి శనివారం ...

Widgets Magazine