శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (13:07 IST)

హాహా.. బొలెరో కార్లను ఎత్తడానికి హైడ్రాలిక్ లిఫ్ట్‌లక్కర్లేదు.. బాలయ్య ఉన్నాడట...

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంపై ప్రముఖ వ్యాపార వేత్త ఆన

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. 
 
'జై సింహా' సినిమాలో మహింద్రా కంపెనీకి చెందిన బొలెరో కారును బాలయ్య ఒంటిచేత్తో పైకి లేపే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఆయనకు ట్యాగ్ చేయడంతో ఆనంద్ మహింద్రా ఇలా సరదాగా స్పందించారు. 
 
"హాహా.. బొలెరో కార్లను చెక్ చేయాడానికి మా సర్వీసింగ్ సెంటర్లలో ఇకపై హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనవసరం లేదు" అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా, యువరత్న బాలయ్యకు ఈ తరహా సన్నివేశాలు కొత్తేంకాదు. 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాలో తొడకొట్టితే రైలు వెనక్కి వెళ్లే సన్నివేశం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.