శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 8 మే 2018 (21:13 IST)

చంద్రబాబు దొంగ ఏడుపుల్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె. ఆంజనేయ రెడ్డి సూచించారు. ఓటుకు నోటు కేసున

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె. ఆంజనేయ రెడ్డి సూచించారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ సీఎం చంద్రశేఖర రావుకు సూచించారు. కేంద్రంపై ఏపీ సర్కారు కొత్త డ్రామాను మొదలెట్టిందని.. చంద్రబాబు దొంగ ఏడుపుల్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రామా పార్టీగా మారిపోయిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్ బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధుల్ని విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు.