Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నాం.. ఇక ఆర్థిక కష్టాలే: యనమల

గురువారం, 8 మార్చి 2018 (13:42 IST)

Widgets Magazine
Yanamala

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే ఆర్థిక లోటు ఏర్పడిందని.. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నవ్యాంధ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేయడంతో ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని యనమల తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులను నిలిపివేస్తుందని తాను భావించట్లేదని యనమల చెప్పారు. 
 
కేంద్రం నుంచి కటీఫ్ ఇచ్చినా.. కేంద్రం సాధారణ నిధులను ఆపితే, అది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమవుతుందని యనమల అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలు తప్పవని కేంద్రాన్ని యనమల హెచ్చరించారు. ఇప్పటికీ రెవెన్యూ లోటును కేంద్రం పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదని.. కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాలనే నిర్ణయం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
యనమల బడ్జెట్‌లోని కీలకాంశాలు 
* మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,839 కోట్లు
సామాజిక భద్రతకు - రూ. 3,029 కోట్లు
మహిళలకు వడ్డీ లేని రుణాలకు - రూ. 1,000 కోట్లు
ఎస్సీ కులాల సాధికారతకు - రూ. 901 కోట్లు
ఉచిత విద్యుత్ కు - రూ. 3,000 కోట్లు
గిరిజన సంక్షేమం - రూ. 250 కోట్లు
ఐటీకి ప్రోత్సాహకాలు - రూ. 400 కోట్లు
డ్వాక్రా రుణమాఫీ - 1,700 కోట్లు
తిరుపతి మహిళా విశ్వవిద్యాలయానికి - రూ. 20 కోట్లు
మహిళా సంక్షేమం - రూ. 2,839 కోట్లు
ఎన్టీఆర్ జలసిరి - రూ. 100 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ కు - రూ. 1,450 కోట్లు
నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం - రూ. 400 కోట్లు
కాపు సామాజిక వర్గ విద్యార్థులకు - రూ. 400 కోట్లు
పట్టణాభివృద్ధికి - రూ. 7,740 కోట్లు
ఇరిగేషన్‌‌కు కేటాయింపుల్లో పోలవరంకు రూ. 9,000 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక - రూ. 100 కోట్లు
చేనేత కార్మికులకు - రూ. 42 కోట్లు
గృహ నిర్మాణం - రూ. 3,679 కోట్లు
పరిశ్రమలు, గనులు - రూ. 3,074 కోట్లు
హోంశాఖకు - రూ. 6,226 కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల ప్రకటించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీసం మెలేసి.. రాజీనామా చేద్దాం.. రండి: వైకాపా ఎంపీలకు జేసీ సవాల్

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలకలం రేపారు. పార్లమెంట్ ఆవరణలో జేసీ ...

news

హెల్మెట్ ధరించలేదని.. వెంటబడిన పోలీసులు.. యువతి కిందపడి?

హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి ...

news

బడ్జెట్ 2018-19.. రాజధాని లేదు.. ఆదాయాన్ని కోల్పోయాం: యనమల

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ ...

news

ఆ ఇద్దరి రాజీనామా.. ఆ ముగ్గురి నవ్వులు.. చంద్రబాబు ప్రశంసల జల్లు

అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన భాజాపా నేతలు కామినేని ...

Widgets Magazine