Widgets Magazine

తెలుగోడి దెబ్బకు.. 30 సెకన్లలో లోక్‌సభ, 3 నిమిషాల్లో రాజ్యసభ వాయిదా...

పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు సజావుగా సాగేలా కనిపించడం లేదు. విభజన హామీల అమలుతో పాటు గత నెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్

tdp mp's agitation
pnr| Last Updated: బుధవారం, 7 మార్చి 2018 (11:47 IST)
పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు సజావుగా సాగేలా కనిపించడం లేదు. విభజన హామీల అమలుతో పాటు గత నెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారంటూ ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న అధికార టీడీపీకి చెందిన ఎంపీలు చేస్తున్న ఆందోళనలతో బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఫలితంగా
పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తూ ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు, తమతమ సమస్యల పట్ల ఇతర పార్టీల ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో, అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభను నిర్వహించలేదని పరిస్థితి నెలకొంది. ఉభయ సభలను ఆర్డర్‌లో పెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఛైర్మన్ వెంకయ్యనాయుడుల ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

ముఖ్యమైన విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది... సభలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలంటూ పలుమార్లు కోరినా సభ్యులు శాంతించలేదు. దీంతో, బుధవారం ఉభయ సభలు ప్రారంభమైన నిమిషం లోపే లోక్‌సభ, 3 నిమిషాల్లో రాజ్యసభ వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి.


దీనిపై మరింత చదవండి :