Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పార్లమెంటులో కె. కవిత 'జై ఆంధ్ర'... పవన్ కళ్యాణ్ 'తెలంగాణ'

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (18:17 IST)

Widgets Magazine
Kavitha

పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గురువారం నాడు పార్లమెంటులో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలంటూ ఏపీ ఎంపీల నిరసనలకు తాము మద్దతు తెలుపుతున్నట్లు కవిత తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలను సత్వరమే నెరవేర్చాలనీ, తెదేపా ఎంపీలు చేస్తున్న డిమాండులో న్యాయం వుందని ఆమె అన్నారు. 
 
తన ప్రసంగాన్ని ముగిస్తూ చివర్లో 'జై ఆంధ్రా' అంటూ ముగించారు. మరోవైపు గురువారం నాడు హైదరాబాదులో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామన్న నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఎంతో వున్నా, వాటిని పట్టించుకోవడం లేదనీ, అందుకే మేధావులతో సమావేశమై చర్చించి ముందుకు సాగాలనుకుంటున్నట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Lok Sabha Tdp Mp Pawan Kalyan Ap Special Status K Kavitha Speech

Loading comments ...

తెలుగు వార్తలు

news

బంద్ పైన దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో జరుగుతున్న బంద్ పైన దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ...

news

పవన్... కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.. జేపీ కామెంట్స్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆసక్తికర ...

news

కాన్పు ఖర్చులకు డబ్బులివ్వలేదనీ భార్యను చంపేశాడు

కాన్పు ఖర్చులకు అత్తింటివారు డబ్బులు ఇవ్వలేదనీ ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యనే ...

news

జేపీ కోసం జనసేనాని : కదనరంగంలోకి దూకిన పవన్ కళ్యాణ్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక సంయుక్త కార్యారణ ...

Widgets Magazine