Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (21:21 IST)

Widgets Magazine
arun jaitley - ap map

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ఏపీ టీడీపీ ఎంపీలు చుక్కలు చూపిస్తున్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నారు. ఉభయ సభల్లో ఆందోళన పర్వం కొనసాగిస్తున్నారు. ఆరు రోజుల పాటు విభిన్న నిరసనలతో పార్లమెంట్‌ను అట్టుడికించారు. 
 
ఈ క్రమంలో రెండుసార్లు ఏపీకి సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసినా.. టీడీపీ ఎంపీలు ఏమాత్రం సంతృప్తి చెందకపోవడంతో రాజ్యసభలో మూడోసారి ముచ్చటగా వివరణ ఇచ్చేందుకు జైట్లీ ప్రసంగం చేశారు. 
 
అంతకుముందు మూడోసారి చేసే ప్రకటనలో ఏపీ గురించి స్పష్టమైన అంశాలుండాలని టీడీపీ ఎంపీలు పట్టుబడుతున్నారు. అరుణ్‌ జైట్లీ, అమిత్‌షాతో సుజనా మంతనాలు చేశారు. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ మూడోసారి చేసిన ప్రసంగంలో పాత కథనే కొత్తగా చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ భారీ ఆదాయం కోల్పోయిందన్నారు.
 
రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక కారిడార్‌పై ఆయా శాఖలు పరిశీలిస్తున్నాయన్నారు. దీంతో మూడోసారి కూడా కొత్త ప్రకటన చేయని జైట్లీ ప్రసంగాన్ని టీడీపీ ఎంపీలు వింటున్నా.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని, పోలవరం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. రెవెన్యూ లోటు ఎంత అనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు జైట్లీ వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చౌదరి రాజీనామా చేసెయ్... రెడీ సర్.. మరో రెండురోజుల్లో...?

ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి ...

news

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ...

news

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?

కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి ...

news

అయ్య బాబోయ్.. అమిత్ షా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదంటే నమ్మరే : వీర్రాజు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ ...

Widgets Magazine