Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశంలోని ముఖ్యమంత్రుల్లో శ్రీమంతుడు ఎవరు?

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (08:54 IST)

Widgets Magazine
chandrababu

దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా? సాక్షాత్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈయన చర, స్థిరాస్తులు రెండూ కలిపితే చంద్రబాబు వ్యక్తిగత సంపద రూ.177 కోట్లుగా ఏడీఆర్ లెక్కగట్టింది. 
 
ఏడీఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం చంద్రబాబుకు రూ.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ.42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.177,78,95,611 ఉన్నట్లు ఏడీఆర్‌ సంస్థ వెల్లడించింది. చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎం... అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ. ఈయన ఆస్తుల విలువ రూ.129కోట్లకుపైగా ఉంది. మూడో స్థానం పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ది.
 
ఇక 15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాలుగో ధనిక సీఎంగా ఉన్నారు. కేసీఆర్‌ దగ్గర రూ.6,50,82,464 విలువైన చరాస్తులు, రూ.8.65 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సీపీఎంకు చెందిన త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ ఆస్తుల విలువ రూ.26 లక్షల 83 వేల 195 మాత్రమే. పేద సీఎంల జాబితాలో రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (రూ.30 లక్షలు), మూడో స్థానంలో జమ్మూ కాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ  (రూ.55 లక్షలు) ఉన్నారు. మమతా బెనర్జీ దగ్గర ఒక్క రూపాయి కూడా విలువ చేసే స్థిరాస్తి లేకపోవడం విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
చంద్రబాబు నాయుడు ధనవంతుడు ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు ఏడీఆర్ నివేదిక Adr India Poorest Manik Sarkar Chandrababu Naidu Richest Chief Minister

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్

అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ ...

news

బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు : వదినను హత్య చేసి రంపంతో ముక్కలు చేశాడు

గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి హైదరాబాద్ కొండపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద ...

news

నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా భద్రత లేదు. ఢిల్లీ ...

news

సుంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి ప్రతీకారం తప్పదు : నిర్మలా సీతారామన్

జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని ...

Widgets Magazine