Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేంద్రానికి మనం సహకరించాం- మనకు కేంద్రం సహకరించాలి... సీఎం చంద్రబాబు

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (22:03 IST)

Widgets Magazine
chandrababu

మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్నివిధాలా సహకరించాం. జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు తదితర అంశాలలో అండగా నిలిచాం. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరింత సహకారం అందించాలి. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాకా కేంద్రం చేయూత ఇవ్వాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
స్వాతంత్ర్య పోరాటం గత చరిత్ర- రాష్ట్ర ప్రయోజనాల పోరాటం ఇప్పటి చరిత్ర:
స్వాతంత్ర్యం కోసం పోరాడటం గత చరిత్ర. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఎంపీలు అందరికీ అభినందనలు. ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేయాలి. మూడున్నరేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటు వల్లే అన్ని సమస్యలు అధిగమించగలిగాం. బాధ్యత పెంచాం, సమర్ధత చూపాం. దీనిని ఇకపై కూడా మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా కొనసాగించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడమే: 
ప్రతిపక్షం లేఖల ద్వారా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పట్టుబట్టిన కేంద్రమంత్రి మీద ప్రతిపక్షం ఫిర్యాదులు శోచనీయం. తెలిసి చేసినా తెలియక చేసినా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. ప్రతిపక్ష పోకడలు ప్రజాప్రయోజనాలను కాలరాసేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
 
116 రోజుల జలసంరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి: 
నేటి నుంచి 116 రోజులు జలసంరక్షణ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రెండవదశ జలసంరక్షణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడిక తీత, ముళ్లకంపల తొలగింపు, గట్ల పటిష్టం తదితర పనులను ముమ్మరం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల చెరువులు, 2,500 సెలయేళ్లు, 10 వేల చెక్ డ్యామ్‌లలో చేపట్టిన జలసంరక్షణ పనులను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి వర్షపు చుక్కను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలవాగు పనుల్లో తాను స్వయంగా పాల్గొంటున్నానంటూ, ఆయా జిల్లాలలో జరిగే పనుల్లో కలెక్టర్లు,మంత్రులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. 
 
అతి త్వరలో లక్షన్నర గృహాల సామూహిక గృహ ప్రవేశం: 
అక్టోబర్ 2న లక్ష గృహాల సామూహిక గృహ ప్రవేశం విజయవంతం చేశాం. త్వరలోనే జరిగే లక్షన్నర గృహాల సామూహిక గృహ ప్రవేశం కూడా విజయవంతం చేయాలి అని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం రోజుకు 100 ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తున్నామని, దీనిని 150 ఇళ్లకు పెంచాలని ఆదేశించారు. ప్రతిరోజూ 150 ఇళ్ళ నిర్మాణం పూర్తికావాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు. 2016-17 పనులు ప్రారంభం అయిన అన్ని ఇళ్లను వెంటనే పూర్తిచేయాలన్నారు. 2017-18, 2018-19 మంజూరైన ఇళ్ల నిర్మాణపనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అంగన్‌వాడి భవనాల నిర్మాణం ముమ్మరం చేయాలన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nda Andhrapradesh Budget 2018 Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

బస్సులో పక్కసీట్లో పురుషుడు హస్తప్రయోగం... వీడియో అప్‌లోడ్ చేసిన అమ్మాయి...

ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ యువతి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మధ్యవయస్కుడైన ఓ ...

news

ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13-14 తేదీలలో మహాశివరాత్రి వేడుకలు(Video)

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13, 14 తేదీలలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు ...

news

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ ...

news

ఏఎస్పీ సునీతా రెడ్డి అక్రమ సంబంధం కేసు... యాంకర్ సోదరుడితో తొలిగా...

ఏఎస్పీ సునీత రెడ్డి కేసులో మరో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈ వివరం తెలుసుకుని ఆమె భర్త ...

Widgets Magazine