Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్ లాంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు : ఉండవల్లి అరుణ్ కుమార్

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (15:16 IST)

Widgets Magazine
undavalli arun kumar

తనది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ బిరుదు ఇచ్చిన మంత్రికి ధన్యవాదాలు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే, ధృతరాష్ట్ర కౌగిలి నుంచి కూడా తప్పించుకోవచ్చన్నారు. అదేసమయంలో పవన్ కళ్యాణ్ వంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటారన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక నిజ నిర్ధారణ కమిటీ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ)ని ఏర్పాటు చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, జేపీతో పవన్ భేటీ కాగా, పవన్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సోమవారం ఉండవల్లి, జేపీలు సమావేశమై అన్ని అంశాలపై చర్చించారు. ఇందులో వామపక్ష నేత రామకృష్ణ కూడా పాలుపంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తనది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ బిరుదు ఇచ్చిన మంత్రికి ధన్యవాదాలు అంటూనే.. ఆ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి తప్పించుకోవచ్చన్నారు. అలాగే, పవన్ లాంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటారని గుర్తు చేశారు. ఈ నెల 18వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందులో అన్ని వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తామన్నారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే ...

news

దేశ ఆర్మీ కంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువ : మోహన్ భగవత్

దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ...

news

వెన్నుకు బుల్లెట్ తగిలినా బిడ్డకు జన్మనిచ్చిన జవాను భార్య

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ...

news

పేకాటలో జోకర్‌కు ఎంత విలువ ఉందో వర్మకేం తెలుసు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను జోకర్లతో పోల్చడంపై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ ...

Widgets Magazine