Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (12:37 IST)

Widgets Magazine

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తదుపరి చర్యలపై చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులను సలహా అడిగారు. ఈ మేరకు ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. 
 
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని  జాతీయ స్థాయిలో గొంతెత్తి  చాటారని విషయాన్ని కొనియాడారు.  అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసనలు తెలిపి.. డిమాండ్లను సాధించుకురావాలని పిలుపు నిచ్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు కేంద్రం సానుకూల సంకేతాలు పంపిందనే విషయాన్ని ఓ ఎంపీ ప్రస్తాలించారు. 
 
జోన్, హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ, విద్యాసంస్థలు, రాజధానికి నిధులు తదితర విషయాలపై చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వుండాలని చంద్రబాబు ఆదేశించారు.  
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌తో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరూ చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వున్న పవన్.. అందులో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్‌లో తప్పతాగి నానాయాగీ చేసిన యువతి..

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో ...

news

జమ్మూకాశ్మీర్‌లో వివాహం.. డేట్ ఫిక్స్ 18న పెళ్లికూతురు కానున్న ఆమ్రపాలి

ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను ...

news

వాణీ విశ్వనాథ్‌కి బిస్కెట్ - రోజాకు జిలేబీ... ఏంటిది..?

ముందస్తు ఎన్నికలు రాకుండానే వైసిపి ఎమ్మెల్యే రోజాకు కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి.. ...

news

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?

రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ...

Widgets Magazine