Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోదీపై అంత విశ్వాసం వుంటే.. ఇక అవిశ్వాసం ఎందుకయ్యా?: బాబు

సోమవారం, 12 మార్చి 2018 (09:00 IST)

Widgets Magazine

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీపై అంత విశ్వాసం వుంటే ఇక అవిశ్వాసం పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పార్లమెంట్ వేదికగా చేపట్టాల్సిన నిరసనలు, కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలన్న అంశాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా వైకాపాపై చంద్రబాబు మండిపడ్డారు. మోదీపై కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓ వైపు విశ్వాసం, మరోవైపు అవిశ్వాసం అంటూ డొంకతిరుగుడు మాటలెందుకని ధ్వజమెత్తారు. హోదా విషయంలో టీడీపీ వైఖరి సుస్పష్టమని, రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని బాబు తెలిపారు.
 
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే.. బీజేపీతో పొత్తు వుంటుందా? వుండదా? చెప్పాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో లాలూచీ పడిన జగన్, ఇప్పటికే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
 
కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి వంత పాడుతున్నాడని మండిపడ్డారు. వైకాపా ప్రజా సెంటిమెంట్‌తో ముడిపడిన ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేస్తోందని, అందుకు ప్రజలే బుద్ధి చెబుతారని ప్రత్తిపాటి హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జాతిపితను చంపిన గాడ్సే నెం.1 హిందూ టెర్రరిస్ట్: అసదుద్ధీన్ ఓవైసీ

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ ...

news

భార్య ప్రేమించింది.. ప్రేమికుడితో వివాహం జరిపించిన భర్త.. ఎక్కడ?

భార్య ప్రేమించిందని.. పెళ్ళయ్యాక తెలుసుకున్న భర్త ఏం చేశాడంటే..? భార్యకు ఆమె ప్రేమికుడి ...

news

ఈడా ఉంటా... ఆడా ఉంటా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు ...

news

ఎవ‌రీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్?

టి.ఆర్.ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ పేరును ఖ‌రారు చేసింది. ...

Widgets Magazine