Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైకాపా ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్.. టీడీపీలోకి వస్తే.. ఆ రెండు పదవులు?

శనివారం, 10 మార్చి 2018 (12:03 IST)

Widgets Magazine

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగు దేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వారంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో జరిగే మూడు స్థానాల్లో విజయం సాధించాలంటే.. టీడీపికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఏర్పడింది. ఇందుకోసం వైకాపా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల కోసం టీడీపీ నేతలు బేరసారాలు మెుదలుపెట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అంతేగాకుండా వైసీపీ నుంచి ఎవరైతే జంప్ అయి.. టీడీపీలోకి వస్తారో వారికి ఇప్పటికే రాజీనామాలు చేసిన బీజేపీ నేతలు పైడికొండలు, కామినేని స్థానాలను ఇస్తామని టీడీపీ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా వైకాపా నుంచి పార్టీ ఫిరాయించే వారికి వైద్య, దేవాదాయ శాఖ బాధ్యతలు సిద్ధంగా వున్నాయని కూడా టీడీపీ సంకేతాలు ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయాల్సిన టీడీపీ అభ్యర్థులు ఎవరనేదానిపై కసరత్తు మొదలైంది.
 
మరోవైపు బీజేపీతో పొత్తుకు కటీఫ్ ఇచ్చే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవులనే వదులుకున్న తరువాత, ఇంకా ఎన్డీయేలోనే ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుతో చెప్పినా.. బీజేపీకి కొంత సమయం ఇచ్చి చూద్దామని చంద్రబాబు అన్నట్లు వార్తలొస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సింహం బోనులోకి వెళ్ళి ఆడుకున్న బాలబాలికలు.. ఏమైందంటే?

సింహం బోనులోకి వెళ్తే ఇంకేమైనా వుందా..? కానీ కొందరు బాలబాలికలు సింహం బోనులోకి వెళ్లారు. ...

news

వామ్మో కండరాలు పట్టేస్తున్నాయి... అబ్బా... ఏం చేయాలి?

ఈమధ్య ప్రతి ఒక్కరిలో కండరాలు పట్టడం, కాలి మడాల నొప్పి రావడం సర్వసాధారణమైనది. రాత్రిపూట ...

news

మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు.. ఎందుకో తెలిస్తే షాక్..

డ్రెస్ కోడ్ సరిగ్గా లేదన్న నెపంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మహిళ విద్యానికేతన్ అధినేత, ...

news

జనసేనలోకి ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధరం.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్

సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో వుండి, ఎమ్మెల్సీగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి.. ...

Widgets Magazine