గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జులై 2018 (08:30 IST)

బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్టువేశారు... ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె పేగులు విషపూరితం కావడంతో మహిళ మృతి

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె పేగులు విషపూరితం కావడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన  రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
 
జిల్లాలోని షాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడకు చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. ఈమె గత 2017 అక్టోబరు 3వ తేదీన ప్రసవ నొప్పులతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అయితే, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మాత్రమే కాన్పు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. 
 
దీంతో ఆపరేషన్‌కు వారు సమ్మతించారు. ఆ తర్వాత సర్జరీ ముగిసిన తర్వాత పొరపాటున కడుపులో బ్యాండేజీ క్లాత్‌, దూదిని ఉంచి కుట్లు వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మే 27వ తేదీన శస్త్రచికిత్స చేసి కడుపులోంచి బ్యాండేజీ క్లాత్‌‌ను, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. 
 
అయితే, అప్పటికే పేగులు విషపూరితం కావడం వల్ల గత నెల 15వ తేదీ ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన సోదరి మృతి చెందిందని.. ఆమె సోదరుడు రవి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి ఆరోగ్యశాఖ జిల్లా కోఆర్డినేటర్‌‌కు హెచ్ఆర్సీ నోటీసుల జారీ చేసింది.