శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (15:42 IST)

గంటకు 100 మైళ్ళ వేగంతో తుమ్ము... ఆపితే మరణమేనా?

చాలా మంది పిల్లలు లేదా పెద్దలు వచ్చే తుమ్మును బలవంతంగా ఆపుతుంటారు. నిజానికి తుమ్మితే "చిరంజీవ" అంటూ పెద్దలు దీవిస్తారు. పైగా, తుమ్మిన వెంటనే బయటికి పోవద్దని, కాసేపు ఆగి, నీళ్లు తాగివెళ్లాలని చెబుతున్న

చాలా మంది పిల్లలు లేదా పెద్దలు వచ్చే తుమ్మును బలవంతంగా ఆపుతుంటారు. నిజానికి తుమ్మితే "చిరంజీవ" అంటూ పెద్దలు దీవిస్తారు. పైగా, తుమ్మిన వెంటనే బయటికి పోవద్దని, కాసేపు ఆగి, నీళ్లు తాగివెళ్లాలని చెబుతున్నారు. కానీ, అదే పెద్దల్లో కొంతమంది ఆ తుమ్మును ఆపుతారు.  ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్యులు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
* తుమ్ము విషయంలో నిర్లక్ష్యంగా తగదని, తుమ్మును ఆపితే ప్రాణాంతకమంటున్నారు. 
* గంటలకు వంద మైళ్ల వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉందని లీసెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. 
* లండన్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఇటీవల తుమ్మును ఆపేందుకు ముక్కు, రంధ్రాలు నోరు ఒకేసారి మూశాడు. 
* దీంతో తుమ్మవేగానికి అతడి గొంతులోపల రంధ్రం ఏర్పడింది. 
* ఆ తర్వాత గొంతు వాచిపోయి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరాడు. 
 
* పరీక్షలు చేయగా, గొంతులో రంధ్రం ఏర్పడిందని, గాలి బుడగలు.. వేగంగా వెళ్లి గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయని తేలింది. 
* ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే ప్రాణానికి ముప్పు వాటిల్లేదని వైద్యులు చెప్పారు. 
* తుమ్ముతో గాలి బలంగా ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే ప్రతికూల ప్రభావం ఉంటుంది. 
* తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి దూసుకెళ్లి, వెంటనే మరణం సంభవించే అవకాశముంది. 
* రక్తనాళాలు కూడా పగిలిపోతాయి. కాబట్టి తుమ్ము ఆపొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.