Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాపు బిల్లుకు కేంద్రం బ్రేక్ : చంద్రబాబుకు మోడీ మరోషాక్

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (08:53 IST)

Widgets Magazine
chandrababu naidu

తెలగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు వర్గానికి రిజర్వేషన్లు కల్పించేందుకు తయారు చేసిన బిల్లుకు కేంద్రం మోకాలొడ్డింది. ఈ మేరకు కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాపు రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) బ్రేకులు వేసింది. దీనిని నిలిపి ఉంచాలంటూ కేంద్ర హోంశాఖకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేసింది. 
 
గత ఎన్నికల సమయంలో కాపులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఈ అంశంపై బీసీ కమిషన్‌ను నియమించింది. కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా గత ఏడాది డిసెంబరులో 'ఆంధ్రప్రదేశ్‌ కాపు రిజర్వేషన్‌ బిల్లు'ను శాసనసభలో ఆమోదించింది. ఆ తర్వాత ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ దీనిని నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం పంపించారు. 
 
రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత... రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో ఈ అంశాన్ని చేర్చినట్లయితే న్యాయ వివాదాలకు తావులేకుండా కాపులకు రిజర్వేషన్‌ లభిస్తుంది. ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ సలహా, సూచనల మేరకే నడుచుకుంటారు. కేంద్ర హోంశాఖ దీనిపై డీవోపీటీ అభిప్రాయం కోరింది. అయితే... ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే డీవోపీటీ కాపు బిల్లుకు పార్లమెంటుదాకా వెళ్లకుండానే అడ్డుకట్ట వేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికాలో గన్‌కల్చర్... సస్పెండ్ చేశారనీ సహచరులను కాల్చి చంపిన విద్యార్థి

అమెరికాలో గన్‌కల్చర్ మరోమారు పడగవిప్పింది. ఉన్మాదిగా మారిన ఓ విద్యార్థి సహచర విద్యార్థిని ...

news

వివాహేతర బంధానికి అడ్డొస్తుందనీ గర్భిణీని చంపి.. స్టోన్ కట్టర్‌తో ముక్కలు చేశారు...

హైదరాబాద్ నగరంలో కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద లభ్యమైన వివాహిత(గర్భిణి) మృతదేహం ...

news

ఆయన ఎంపీ కాదు.. విజిటింగ్ ప్రొఫెసర్ : బీజేపీ ఎంపీలు సెటైర్లు

లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార ...

news

కాంగ్రెస్ పార్టీ మనకు బాగా కలిసొస్తుంది - కోదండరాంతో రేవంత్ రెడ్డి

టిఆర్ఎస్ పైన పోరాటం చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకుపోతున్నారు జెఎసీ ఛైర్మన్ కోదండరాం. ...

Widgets Magazine