Widgets Magazine

సన్నీలియోన్ అర్ధనగ్న ఫోటోలను రైతులు అలా ఉపయోగిస్తున్నారట?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:15 IST)

sunny leone

నరదిష్టి నుంచి పంట పొలాలను కాపాడేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ ఫోటోలను పొలం వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఫోటోను ఏర్పాటు చేయడం ద్వారా దారినపోయే వారి దృష్టిని పంట పొలాలపై కాకుండా.. ఆ ఫోటోలపై మరల్చుతున్నారు. తద్వారా పంట పొలాలపై నరదిష్టిని దూరం చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు ఈ కొత్త ఐడియాను అమలు పరుస్తున్నారు. బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండటంతో దారిపోయే వారు అటువైపు చూడకుండా వుండలేకపోతున్నారు. 
 
ఇలా బాటసారుల దిష్టి పచ్చని పంట పొలాలపై పడుతుండటం ద్వారా దిగుబడి తగ్గిపోతుందని భావించిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లీంచేందుకు పొలం గట్లపై సన్నీ లియోన్ అర్ధనగ్న పటాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్‌లో అది నచ్చింది.. నిజమైన రాజకీయాలు?: ఉండవల్లి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడలేదని, సామాన్య పౌరుడిలా ప్రశ్నలేశారని.. ...

news

కేంద్రం ఇచ్చిన నిధులెంత? రాష్ట్రం ఖర్చు చేసిందెంత? పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ ...

news

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయం.. ప్రధాని మోదీ శంకుస్థాపన

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ...

news

మద్యం షాపుల దందాకు బ్రేక్.. ''లిక్కర్ ప్రైస్ యాప్'' ప్రారంభం

రిటైల్ మద్యం దుకాణాల్లో పారదర్శకత కోసం లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ...

Widgets Magazine