బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (14:27 IST)

బెలూన్ ఫెస్టివల్‌కు పిలవలేదట.. కొత్తపల్లి గీత సెటైర్లు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారి పరిస్థితి అధ్వానంగా మారింది. ఏపీ సీఎం అభివృద్ధి నచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్త పల్లి గీతను పట్టించుకునే వారు కరువయ్యారు. ఇంకా చెప్పాలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారి పరిస్థితి అధ్వానంగా మారింది. ఏపీ సీఎం అభివృద్ధి నచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్త పల్లి గీతను పట్టించుకునే వారు కరువయ్యారు. ఇంకా చెప్పాలంటే.. అరకు ఏజెన్సీ ప్రమోషన్‌ కోసం నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్‌కు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. దీంతో కొత్త పల్లిగీత సోషల్ మీడియా ద్వారా ఏపీ సర్కారుపై సెటైర్లు విసిరారు. 
 
తమ ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ ఫెస్టివల్‌కు స్థానికులమైన తమకు కూడా ఆహ్వానం లేదని.. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని.. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ అంటూ సోషల్ మీడియాలో కొత్తపల్లి గీత వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఈ బెలూన్ ఫెస్టివల్‌కు మంత్రులు అఖిలప్రియ, గంటా, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారని ప్రచారం జరిగింది. మూడు రోజుల పాటు ఈవెంట్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. 
 
ఇంకా వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఈవెంట్ ప్రారంభించారు. అయితే తొలి రోజు గంట పాటు బెలూన్లు ఎగురవేయగానే వర్షం వచ్చేసింది. మూడు రోజుల పాటు గాలులు, వర్షం కారణంగా ఈవెంట్‌ జరగకుండానే ముగిసింది. బెలూన్ ఫెస్టివల్ కోసం ఖర్చు చేసిన రూ.5కోట్లు గాలిలో కలిసిపోయాయి. ఈ ఫెస్టివల్‌కు స్థానిక టీడీపీ నేతలకు అధికారులు సమాచారం ఇవ్వలేదు. 
 
అయితే కొత్తపల్లి గీతను ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడో పక్కన పెట్టేశారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల నియమించిన గిరిజన సలహా మండలిలోనూ గీతకు బాబు హ్యాండిచ్చారు. ఆ సమయంలో గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వం ద్రోహం చేస్తోందని కొత్తపల్లి గీత ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు కొత్తపల్లి గీతను  పక్కనబెట్టేశారని.. ఏమాత్రం పట్టించుకోవట్లేదని సమాచారం. దీంతో కొత్తపల్లి గీత అటూ కాకుండా ఇటూ కాకుండా నిలిచిపోయారు.