Widgets Magazine

ఎత్తు పెరిగేందుకు మందులు వాడాడు.. ప్రాణాలు కోల్పోయాడు

బుధవారం, 24 జనవరి 2018 (13:26 IST)

medicine

"మీరు లావుగా ఉన్నారా.. మా మందు వాడితే రోజుల్లోనే వారం రోజుల్లోనే స్లిమ్‌గా తయారవుతారు.. వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదు". "మీరు పొట్టిగా ఉన్నారా.. అందరిలో తక్కువగా ఉన్నారా.. మనోవ్యథకి గురవుతున్నారా.. టెన్షన్ వద్దు.. వెంటనే మా మెడిసిన్ వాడండి.. 40 రోజుల్లోనే తలెత్తుకుని తిరగండి". ఇలాంటి ప్రకటనలు మనం నిత్యం టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఈ ప్రకటనే ఓ యువకుడి ప్రాణం తీసింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఖాజా నజీర్ (17) అనే యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. నజీర్ కాస్త ఎత్తు తక్కువగా ఉంటాడు. దీంతో అతను మనోవ్యథకు గురవుతూ వచ్చాడు. ఈ టైంలోనే టీవీలో ఓ యాడ్ చూశాడు. మేం ఇచ్చే మందులు వాడితే ఎత్తు పెరుగుతారన్న ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. 
 
వెంటనే ఆన్‌లైన్ ద్వారా మందులు ఆర్డర్ చేశాడు. వాటిని మూడు రోజులు వాడిన తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత కోలుకున్నా.. కొన్నిరోజుల తర్వాత మళ్లీ అదే సమస్య రావడంతో చికిత్స చేయిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు.
 
అయినా పూర్తిగా కోలుకోలేదు. శరీరం లోపలిభాగాల్లో ఇన్‌ఫెక్షన్ కూడా సోకింది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన.. మంగళవారం చనిపోయాడు. ఆన్‌లైన్ ప్రకటనకు ఆకర్షితుడై ప్రాణాలు పోగొట్టుకున్నాడనీ తల్లిదండ్రులు వాపోతున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ విషయంలో కేసీఆర్‌ను మించిపోయిన కేటీఆర్...

గత రెండు నెలల కాలంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఆయన కుమారుడు కేటీఆర్‌నే ...

news

మీరు గాయపడితే చూడలేదు.. ప్లీజ్ అర్థం చేసుకోండి : ఫ్యాన్స్‌కు పవన్ వినతి

తన అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. మీరు గాయపడితే నేను ...

news

'సీఐ అక్రమ సంబంధం' : అనిశా ఏఎస్పీ సునీతారెడ్డిపై వేటు

తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డితో అవినీతి నిరోధక శాఖ (అనిశా) ...

news

అసదుద్దీన్ ఓవైసీపై బూటు దాడి : సౌత్ ముంబైలో...

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బూటు దాడి జరిగింది. దక్షిణ ముంబైలో జరిగిన ...

Widgets Magazine