Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాలిచ్చే తల్లుల్లో ఆ కోర్కెలు వుండవా?

శుక్రవారం, 19 జనవరి 2018 (14:23 IST)

Widgets Magazine
breast feeding

పాలిచ్చే తల్లుల్లో లైంగిక వాంఛలు తక్కువగా వుండటానికి కారణాలను గైనకాలజిస్టులు ఇలా చెపుతున్నారు. లైంగికవాంఛలు తగ్గిపోవడానికి పాలు పట్టడమే కారణమని సెలవిస్తున్నారు. బిడ్డకు పాలిస్తున్నప్పుడు లైంగిక వాంఛలు క్రమంగా తగ్గుతాయట. నెలలు గడిచినా ఇదే పరిస్థితి ఉంటుంది. పాలిస్తున్నప్పుడు ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. అందుకే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాలంటే పాలిస్తున్నప్పుడు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు తక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్ జననేంద్రియాలు పొడిబారకుండా, కలయిక సమయంలో అసౌకర్యంగా మారుతుంది. 
 
అలాగే పాలిస్తున్నప్పుడు శరీరం ప్రొలాక్టిన్ అనే హోర్మోన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. లైంగికవాంఛలు తగ్గడానికి ఇదీ ఓ కారణం అవుతుంది. అలాగే పాలిచ్చే వారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ల శాతం కూడా తక్కువగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుష హార్మోన్. ఇది స్త్రీలకు కొంతవరకూ ఉంటుంది. ఇది లైంగికవాంఛలు పెంచేందుకు కారణం అవుతుంది. ఈ మార్పులకు తోడు ప్రసవానంతరం తల్లిగా బిడ్డ కోసం ఎక్కువ సమయం  కేటాయించాల్సి ఉంటుంది. దాంతో కొన్నిసార్లు అలసిపోవడం ఉద్యోగం చేస్తుంటే వ్యక్తిగత సమయం తగ్గడం, రకరకాల బాధ్యతలతో సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు సహజంగానే ఎదురవుతాయి. ఫలితంగా లైంగికాసక్తి చాలామటుకు తగ్గుతుంది. 
 
కాబట్టి మీ పరిస్థితిని తలుచుకుంటూ ఒత్తిడికి గురికాకుండా దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. ఆలోచనల్ని భాగస్వామితో పంచుకోండి. ఇంటి బాధ్యతలూ, బిడ్డ పనులకు సంబంధించి ఆయన సాయం కోరండి. అలా మిగిలిన సమయాన్ని ఇద్దరి కోసం కేటాయించుకోండి. అలాగని ఆసక్తి లేకున్నా లైంగిక చర్యల్లో పాల్గొనాలని లేదు. బిడ్డ పుట్టకముందు మీరెంత ఆనందంగా ఉండేవారూ, ఇద్దరు అభిరుచులూ, ఆసక్తులూ ఇలా ప్రతీదీ మాట్లాడుకోండి. ఇలా తరచూ చేయడం వల్ల నెమ్మదిగా లైంగికాసక్తి పెరుగుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే?

వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలా? అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలా? అయితే ఈ టిప్స్ ...

news

వెక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేస్తే సరి...

ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి ...

news

నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికీ ...

news

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి?

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి అంటున్నారు మానసిక నిపుణులు. పెళ్లికి ముందు ...

Widgets Magazine