Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ సమయంలో మహిళల సమస్యకు పరిష్కారం...

మంగళవారం, 16 జనవరి 2018 (21:27 IST)

Widgets Magazine
stomach pain

చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుము నొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 
 
1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 
 
2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి ఓసారి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతు దిగుతుంటే హాయిగా ఉంటుంది. అల్లం, పిప్పరమెంట్, లెమన్.... ఇలా రకరకాల హెర్బల్ టీలను తాగవచ్చు. వీటిలోని ఔషధ గుణాలు అలసట పోగొట్టడమే కాకుండా నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. 
 
3. గ్లాసు వేడి నీటిలో కొద్దిగా అల్లం తరుగు వేసి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి తేనె కలిపి రోజులో రెండుసార్లు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
 
4. ఉప్పు, నూనె ఎక్కువగా ఉంచే పదార్ధాలను తీసుకోవడం ఈ సమయంలో మంచిది. వీటి బదులుగా తాజాపండ్లను భోజనంలో చేర్చుకోవడం మంచిది. అరటిపండును తరచు తీసుకోవాలి. ఇందులోని మెగ్నీషియం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. తాజా ఆకు కూరల ద్వారా శరీరానికి కావల్సినంత ఇనుము కూడా అందుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Women Remedies Menstrual Pains

Loading comments ...

మహిళ

news

పంచదార, ఉప్పుతో మెరిసే సౌందర్యం

పంచదార మృతకణాలను నశింపజేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ ...

news

సంతానం లేని మహిళలు ఎండుద్రాక్షలు తింటే?

ఎండు ద్రాక్షలను రోజూ గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు ...

news

డెలివరీ తర్వాత ఇలా చేస్తే బరువు పెరగరు..

ప్రసవం తర్వాత పోషకాహారం తీసుకోవాలి. ప్రసవానంతరం తీసుకునే ఆహారంపై అనుమానాలుంటాయి. ఆ ...

news

మెరిసే గోళ్లకు చిన్ని చిన్ని చిట్కాలు

ఆహారంలో టమోటా, చేపలు ఎక్కువగా తీసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల గోళ్లలో ...

Widgets Magazine