మూర్ఖత్వంతో జగన్‌ పతనం: దివాకర్‌రెడ్డి

JC
ఎం| Last Updated: శనివారం, 18 జనవరి 2020 (22:02 IST)
సీఎం జగన్‌పై టీడీపీ నేత దివాకర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ మూర్ఖత్వం వల్లే కాంగ్రెస్‌కు దూరమయ్యాడని, అదే మూర్ఖత్వంతో సీఎంగా పతనమవుతున్నాడని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నామన్నారు. అమరావతిని ప్రశాంత యాత్రా స్థలంగా చంద్రబాబు ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక వ్యక్తిపై ద్వేషంతో జగన్‌ కులం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాడని జేసీ మండిపడ్డారు.

మనిషికి తల ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని అలాంటిదని, సచివాలయం ఎక్కడ ఉంటుందో అదే రాజధాని అని పేర్కొన్నారు.

సీఎం అమరావతిలోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని, పది క్యాంప్‌ ఆఫీసులు కూడా పెట్టుకోవచ్చన్నారు. పరిపాలన మాత్రం అమరావతిలోనే జరగాలని, అసెంబ్లీ ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటేనని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
దీనిపై మరింత చదవండి :