పవన్‌ కళ్యాణ్ కంటికి ఆపరేషన్... రేణూ ఆరా తీసిందా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరింది. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తికావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

pawan kalyan
pnr| Last Updated: శుక్రవారం, 13 జులై 2018 (16:25 IST)
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరింది. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తికావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
 
కాగా, పవన్ గతకొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఆయన నేత్ర వైద్యులను కూడా సంప్రదించారు. వారు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. 
 
ఆపరేషన్‌తోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. సర్జరీ సక్సెస్ కావడంతో ఒక రోజు ఆస్పత్రిలో ఉండి... గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కొద్ది రోజుల కంటిపై ఒత్తిడి పడకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనిపై మరింత చదవండి :