Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రజలు ఛాన్సిస్తే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్ ప్రకటన

శుక్రవారం, 18 మే 2018 (15:12 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం పగ్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ అన్నారు. సీఎం అంటూ నినాదాలు చేసినంత మాత్రాన తాను ముఖ్యమంత్రి కాలేనని, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాతే సీఎం అవుతానని తెలిపారు. 
 
గంగవరం పోర్టు నిర్వాసితులను కలిసిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేతల స్వార్థం కోసం.. వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పనిచేయరాదని.. ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకూడదని సూచించారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని మండిపడ్డారు.
 
అలాగే అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా అందించాలన్న నినాదంతో ఈ నెల 20వ తేదీ నుంచి ఆధ్వర్యంలో పోరాట యాత్రను ప్రారంభించనున్నట్టు పవన్ అన్నారు. యాత్ర మొత్తం 45 రోజులు కొనసాగుతుందన్నారు. 
 
దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్ర జిల్లాల వారే కనిపిస్తున్నారని, ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఇంకా అక్కడ నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరోమారు ముక్కలవుతుందని, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బలపరీక్షలో గెలుపు మాదే.. యడ్డి :: అసెంబ్లీలో పరాభవం తప్పదు : సిద్ధు

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు శనివారం 4 గంటలకు శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోవాలంటూ ...

news

మా వైపు 6 కోట్ల మంది ఉన్నారు.. అసెంబ్లీలో విజయం మాదే : బీజేపీ కర్ణాటక శాఖ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప శనివారం అసెంబ్లీలో బలాన్ని ...

news

చైనాలో ఓ స్మార్ట్ దొంగ.. షట్టర్ తెరవకుండా.. నగలు దోచేశాడు..

చైనాలో ఓ స్మార్ట్ దొంగ ఎంత పనిచేశాడో తెలుసా.. షాపు షెట్టర్ పగులకొట్టకుండా.. గోడలు ...

news

బీజేపీకి సుప్రీంకోర్టు మరో షాక్ .. బలపరీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్

కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని ...

Widgets Magazine