మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (21:06 IST)

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసు : పవన్

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. కర్ణాటక ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్ని సీట్లు వచ్చినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తనకు తెలుస

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. కర్ణాటక ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్ని సీట్లు వచ్చినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తనకు తెలుసన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వాళ్ల వ్యూహాలు వాళ్లకు ఉన్నాయన్న విషయాన్ని కొందరు అధికారులు తనతో నెల రోజుల క్రితమే చెప్పారన్నారు. బీజేపీకి 85 సీట్లు వచ్చి.. జేడీఎస్‌కి 40 సీట్లు వచ్చినా.. బీజేపీదే అధికారమని వాళ్లు తనతో అన్నారని పవన్ గుర్తుచేశారు. 
 
ఇది తప్పా ఒప్పా అంటే అందరిలోనూ లోపాలున్నాయన్నారు. దశాబ్దాలుగా ప్రజాస్వామ్య పద్ధతులను నీరుగార్చారని.. ఇవాళ కర్ణాటకలో జరుగుతున్నది దానికి మరో ఉదాహరణ అని తెలిపారు. బీజేపీ మాత్రమే కాదని టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయన్నారు. బేరసారాలకు చరమాంకం పలకాలని కోరుకునే వారిలో తాను ఒకడినని పవన్ చెప్పుకొచ్చారు.